Monday, 12 December 2011



పొద్దెలా గడుస్తుందో చెప్పనా..
ఒంటరితనపు గాజు గోడలపై  పేర్చుకున్న కన్నీటి బొట్లకి ..
నీ పేరు పలకటం నేర్పుతున్నా!! 

నువ్వు మిగిల్చిన ప్రశ్నకి
జవాబులడగని లోకాన్ని వెతుకుతున్నా!!

Wednesday, 3 November 2010



మనసుకు అంటిన నీ ప్రేమ..
మరకలుగా ఎదుగుతోంది..!
శిధిలమై వికలమై..
కన్నీళ్ళలో కరుగుతోంది..!!





Thursday, 3 June 2010


ఎవరు నువ్వు?
అలసిన మనసుకి సాంత్వన లేని ఆలోచనలా ..
ఎందుకు నువ్వు ?
తీరం ఒడ్డున ముత్యం లేని ఆల్చిప్పలా ..
ఏమని నువ్వు?
అందని దూరాన అత్తరు చల్లిన కాగితం పువ్వులా..
పోలికలేమని చెప్పను..??
నువ్వు నాకేమి కానప్పుడు..
మనమధ్య నువ్వో- నేనో లేనప్పుడు..!!

Thursday, 1 April 2010

బ్లాగర్ గా సంతోషం..


సంతోషాల వెల్లువగా ...
బుక్స్ అండ్ గల్ ఫ్రెండ్స్ లో ప్రియ రివ్యూ..
సుజనమధురం లో మధురవాణి రివ్యూ..
కౌముది లో కవిత ప్రచురణ ..
మెనీ మోర్ శుభాకాంక్షలు అందుకున్న ఆనందం తో
ఇంకొన్ని మెనీ మోర్ లకై దారులు వెతుకుతూ..

Friday, 26 February 2010



ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం

తనలోకి లాక్కుంటుంది ...
ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో
మనసంతా ఇరుకుచేస్తుంది ..
ఉక్కిరిబిక్కిరిగా
నన్ను ఏడిపిస్తుంది..
దాన్ని వెళ్ళగొట్టాలని చూస్తానా
ముందు వెళ్ళేది "నువ్వు" అని వెక్కిరిస్తుంది ...

Tuesday, 8 December 2009

ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది


ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది....
నీ మాటలు పండించే పువ్వులు నా మనసు నింపి , హాయి గంధాలు చిలుకుతుంది.
నిన్ను కలవలేని మన మధ్య ఉన్న మైళ్ళ దూరాన్ని ప్రతి రోజు కొలుచుకుంటూ ...
తెలీయకుండానే నీ సమీపానికి చేరుకుంటున్నా. !
ఆకాశం లో నాకోసం మెరిసే ఏ తారవో అని వెతుకుతున్నా .. ఏంత ముర్ఖురాలినో కదా.. నిన్ను చందమామ లో పోల్చుకోలేక పోయా.!!
వేల నిముషాల వృధా ప్రయాసలో , నీకు నాకు మధ్య చిగురువేసిన బంధానికి నేనెప్పుడు తోడుగా ఉంటాను. మరి నువ్వు?

ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది..
సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా?
జాగు చేయక చెప్పిపోరాదా?
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??
I Thank Srujana for her Words here with Me.
- Sujji

Wednesday, 28 October 2009

అన్నయ్య

ఈ తడవకు నా మాటలు ఇక్కడ.... B&G

Wednesday, 16 September 2009


ప్రాప్తం లేని నీ ప్రేమకు
గురుతైనా రాని గడ్దిపువ్వును నేను..
నీ జ్ఞాపకాల చిత్తడి లో
వెలసిపోయిన ఇంద్రధనస్సును నేను..!

Sunday, 16 August 2009


దోసిట్లో నువ్వు వదిలిన నవ్వులు
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి.
ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో
నా తనువంతా కన్నీటితో తడిచిపోతుంది.

Friday, 10 July 2009


ఘనీభవించిన వర్షపు చినుకుల చల్లదనం
నా హృదయంలో మెలికలుతిరుగుతుంది..
అర్ధంకాని సాయంత్రాలు
పెనవేసుకున్న నా చేతివేళ్ళల్లో నీ గుర్తులు చూసుకుంటున్నా!

విచ్చుకునే నీ చిరునవ్వు ఊహకై
నా రాత్రులన్నీ ధారపోసి చకోరమై కలలు కంటున్నా..!!

Sunday, 28 June 2009

ఆగని కన్నీరు
గుండె చెరువు చేస్తుంది..
ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా
గొంతు అడ్దుపడుతుంది..
తడికన్నుల చెమ్మ
మనసు తలుపులు మూసింది
నువ్వు ఉన్నావనుకున్నా..
నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ..!!

Sunday, 24 May 2009


నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే ..!
నీ జ్ఞాపకాల చేదే ..!!
తెరలు తెరలుగ నీ ఆలోచనలు ఒక్కొక్కటి గా వెక్కిరిస్తుంటే ..
నాలోకి నేను చూసుకోటానికే భయపడుతున్నా..!!
సగం మలిచిన మట్టి బొమ్మనై..
చేష్టలుడిగి నిలుచున్న...!!

Sunday, 12 April 2009

లేలేత వెదురు మురళిఫై
నీ తీయని ఆధరాలతో
నా అణువణులో నీఫై
ప్రేమనే ఆయువుగా
నీవు పలికే ప్రేమరాగాలకి
నే పరవళ్ళు తొక్కాను

దాచుకోలేని ఉద్వేగముతో
నీరాగంలో నాపాదం కలిపాను
ఎంత శోభాయమానంగా ఉంది ఈ దృశ్యం !
పక్షుల కిలకిలలు,
సెలయేటి గలగలలు,
సుమగంధాల పరిమళాలు,
నువ్వు,
నేను...
ఓహ్ ప్రియ..!
లోకమంతా మన ప్రేమ చిహ్నాలమయమేనా
ప్రకృతి లోని ప్రతి అణువు
మన ప్రేమ గాధలే ,
మన ఉసులే
నాలోని ఈ తమకం ,
నీ బాహువులోని సౌఖ్యం ,
నీ సమక్షంలోని పారవశ్యం,

ఈ క్షణం నా జీవితంలో పదిలం ..!
నువ్వు,
నా జీవితానికే అమూల్యం..!!
-- మన ప్రేమకి
( పైన ఉన్న బొమ్మ నేను వేసిందే..!)

Saturday, 14 March 2009


నువ్వు వదిలిన శూన్యంలో
దారి లేని శకలాన్ని అయ్యాను..
గుండె చీల్చుకొని
నేను పేట్టే ఆక్రందన
నిశబ్దంలో చేదుగా కలిసిపొయింది..

Saturday, 3 January 2009


యుగాలుగా ఒంటరిగా ఉన్న నేను
నిజాయితీగా నా హృదయం పరిచాను..!
నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ
నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు... !!

Tuesday, 23 December 2008

నా బ్లాగు

నా పేరు శ్రీనివాస్
నా ఇల్లు In రాంనివాస్
నాకు లేదు bus pass
తీసుకుంటే money loss

నాకు బాగా గుర్తుండి ఇది నేను నేను 7th క్లాసు చదువుతున్నప్పుడు రాసిన మొదటి తవిక . నేను ఏవ్వరికి తెలియకుండా రాసుకున్న కవితని , ఏవ్వరికి ( నాకు కూడా ) తెలియకుండా స్వప్న చదివేసింది ( ఏంటో.. అది ఇప్పటికి ఆరోగ్యంగానే ఉంది ) . తన ద్వార క్లాసులో సగం మందికి సీక్రెట్ గా నేనో కవయిత్రిని అని తెలిసిపోయింది . అప్పటి నుంచి నన్నో సరోజిని నాయుడులా , కవయిత్రి మొల్లలా ( పోలిక కొంచం ఓవర్ ఐనట్టు ఉంది కాదు..లైట్ తీసుకోండి.. :) ) ఇంకా అదోలా ..చూసే వాళ్ళు . ఆ రెపుటెషన్ని జాగర్త గా కాపాడుకుంటూ , 8th లో స్కూల్ మారాను . సరేలే కొత్త స్కూల్లో మన టాలెంట్ ని చూపిదాం అని ఒక కవిత వాదిలా .. అంతే , అందరు నన్నో సినిమాల్లో కవితల పిచ్చి శ్రీలక్ష్మిలా చూడటం మొదలు పెట్టారు . ఆ అవమానం పెనుభారంగా అనిపించి నేను కవితలు రాయటం చాలా వరకు తగ్గించా .. రాసినా , ఎవరికీ చూపించే దాన్ని కాదు ( చూసారా.. నేను అంత చిన్న వయసులోనే అజ్ఞాతం లోకి వెళ్ళిపోయా !!. )

సరే రోజులన్నీ ఒకేలా ఉండవులే అనుకోని డిగ్రీ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లో నేను వెలగబెట్టిన ఒక కవితని శ్వేత కి చూపించా... ఆరోజు నాకేదో ఆరోగ్యం బాగొలేదేమో అన్నట్టు నన్ను జాలిగ చూడటం మొదలెట్టింది . అసలు నేను రాసిందో కవిత అని కూడా దానికి అర్ధం కాలేదట :( . అంతే.. నా మనసు పరిపరి విధాలా ముక్కలయి బాధపడింది . ఈమాత్రం కళాపోసన లేని వాళ్ళ మధ్య ఇన్నాళ్ళు ఏలా ఉన్నానా అని హాచార్య పోయా ..!

ఆరోజు తరవాత ఇంక ఏవ్వరికి నేను గీసిన పిచ్చి గీతలుకూడా చూపించకూడదు అని శపథం చేసేసుకున్నా ! సాధ్యమయినంతవరకు నాలో ఉన్నా భావావేశాన్ని అణగదొక్కి , నలుగురిలో నేను మీలాంటి దాన్నే అనిపించుకోటానికి , జనజీవనస్రవంతిలో కలిసిపోటానికి ప్రయత్నించా . అప్పట్లో బ్లాగుల గురించి తెలియదు కనుక ఏప్పుడన్నా ఏదన్నా రాసినా , గీసినా నాలుగు రోజులు నేనే చూసుకొని మురిసిపోయి పారెసేదాన్ని .

ఇక్కడ నేనో విషయం అసందర్బం అయినా చెప్పదలుచుకున్నా .. పిల్లలకి చదువు తప్ప ఇంక ఏ ఇతర వ్యాపకం ఉండకూడదు అని తలితండ్రులు భావిస్తారు. ఏమైన కళల పట్ల అభిరుచి ఉన్నట్లు కనీసం గమనించరు . గమనించినా ప్రోత్సహించరు . ఇది అన్ని విషయాల్లో ఉండదు మళ్ళి.!! అబ్బాయి క్రికెట్ అంటే ఓకే అంటారు . అమ్మాయి డాన్స్ అంటే ఓకే అంటారు . కాని అదే పిల్లలు నేను కవితలు రాస్తాను, కధలు రాస్తాను అంటే ఆ ప్రోత్సహం ఉండదు.! క్లాసు పుస్తకాలు చదివే పిల్లవాడి మీద ఉన్న సదభిప్రాయం కధల పుస్తకాలు చదివే పిల్లవాడి మీద ఉండదు. బొమ్మలు గీయటం లో ఉన్న ఇష్టం సిలబస్ లో ఉన్న హార్ట్ నో కిడ్డ్నీనో గీయటం తోనే సరిపెడతారు. అందరు తలితండ్రులు ఇలానే ఉంటారు అనను . కాని చాలా మంది ఇలానే ఉంటారు .

ఏదేమయినా ఈ సంవత్సరం ఒక బ్లాగ్ ప్రారంభించటం సంతోషంగా ఉంది . నా ఈ బ్లాగ్ లో నేనేం రాసినా చదవటానికి ఏవ్వరు లేక పోయినా , చింపుకోకుండా నే రాసింది దాచుకోటానికో చూటు ఉందని హాయిగా ఉంది..!నేను రాసింది నచ్చలేదు అన్నా నొచ్చుకునే అంత పసిమనసు ఇప్పుడు కాదు . కొత్త సంవత్సరంలో అయినా నా ఆలోచనలు మీతో విరివిగా పంచుకుంటాను .

క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Sunday, 30 November 2008

Interesting Links

Hi friends, i would like to share two interesting websites with u

1)www.bharatstudent.com

ఉచితంగా కాల్స్ చేసుకోటానికి..

ఈ వెబ్సైటు లో లాగిన్ అయ్యాక దాంట్లో ఉండే వివిధ ఆప్షన్స్ ద్వార క్రెడిట్స్ స్కోరు చేయ్యచు. మొదటి సారి రిజిస్టర్ అయ్యినందుకు 250పాయింట్స్ ఇస్తారు. తరవాత మనం చూసే విడియో కి తల 5 పాయింట్స్, చాట్ కి 1 పాయింట్ చొప్పున ఆడ్ అవుతాయి. 500 పాయింట్స్ అయిన తరువాత వాటిని రీడీం చేసుకుంటే, 25 రూపాయలు క్రెడిట్ అవుతాయి. చాల సులభంగా 3 , 4 రోజుల్లో 500 పాయింట్స్ చెయ్యవచ్చు. ప్రపంచం లోని ఏ ప్రాంతనికిన కాల్ చేసుకొవచు. కాల్ రేట్స్ తదనుగుణంగా ఉంటాయి. కాల్ చేసుకోటం కోసం G7 software ని ఇనిస్టాల్ చేసుకోవాలి. ఇండియా లో ఏ మొబైల్ కి ఐనా 1.52 నుంచి 2.00 రూపాయల లోపు అవుతుంది. సో , 25రూపాయలకి కనీసం పావుగంట మాట్లాడవచ్చు ఏటువంటి కర్చు లేకుండా!!

2)www.wadja.com

దీని ద్వార ప్రపంచం లో ఏ మొబైల్ కి అయినా SMSలు పంపుకోవచ్చు.


మీకు వీటిగురించి ముందే తెలిసి ఉంటే ok. If not , just have a look at them. Just drop a comment if u like them.

Friday, 3 October 2008


నాది కాని లోకంలో
ఏ మనిషిని వెతకను..??
నీళ్ళు లేని సంద్రంలో
ఏ నావను నడపను..!!??

Monday, 21 July 2008

నీ కోసం...

నీ కోసం ఏరుకొచ్చిన మల్లె లన్నీ
నీ ఊసులతో మాల అల్లాను!
రోజంతా ఎదురు చూసి చూసి....
పువ్వులన్నీ చిన్నబోయాయి..!..
మనసంతా అల్లుకున్న నీ తలపులతో, నా
కనులు బరువెక్కి వాలిపొయాయి..!..
(ఇది నా సొంత కెలుకుడే.. బాగుంటే చెప్పండి.అప్పుడప్పుడు కెలికెస్తా..!)

Tuesday, 15 July 2008

నా మొదటి టపా

హామ్యయ! నేనూ బ్లాగానోచ్..!

ఏంటో..,ఈ బ్లాగ్ గాలి నాకు ఈ మథ్య సోకింది. ఏంతంటే, ఈరోజు తో నేనూ ఒక బ్లాగుదానైపోయా. నాకున్న వెర్రి, పిచ్చి గట్రా సరంజామాతో రంగంలోకి దిగుతున్నా..! ఆశీర్వదించేయండి..

అసలు నేను బ్లాగులు చదవటం మొదలెటి గట్టిగా పది రోజులు కాలేదు..కానీ, ఎంత నచ్చాయంటే, ఆ నచ్చటం వికటించి.. రాయటం మొదలెట్టాలనిపించిది...సరే, అని ఈ fine మార్నింగ్ కూర్చోని ప్రారంబించాను.

నాకు వచ్చినవి, నాకు నచ్చినవి అన్నీ కలిసుండేదే ఈ బ్లాగాహారం. ఏమన్నా అప్పుతచ్చులు ఉంటే క్షమించండి.

దీనికి పేరు ఏం పెట్టాలో అర్దం కాలేదు. చివరకి .."నాలో నేను" అని పెట్టా. ఎలా ఉందో ఏంటో..

నాకు సాధ్యమైనంతవరకు విసుగు రాని విషయాలే బ్లాగుతానని హామీ ఇస్తూ ..ఇప్పటికి విరమిస్తాను.
ఇట్లుసుజన (' సుజ్జి ' మన ముద్దు పేరు మరి...)