Sunday, 28 June 2009

ఆగని కన్నీరు
గుండె చెరువు చేస్తుంది..
ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా
గొంతు అడ్దుపడుతుంది..
తడికన్నుల చెమ్మ
మనసు తలుపులు మూసింది
నువ్వు ఉన్నావనుకున్నా..
నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ..!!

4 comments:

ఉష said...

మూసిన మనసు తలుపులు తెరుచుకుని మౌనం నిను వదిలిపోవాలి. తన భాష్యం వెనక్కి మోసుకు రావాలి. ఇది తథ్యం లేదంటే ప్రేమ అసత్యం. నను నమ్ము నేస్తం. నమ్మిక జీవితానికి ఆధారం.

aswin budaraju said...

:-)

నేస్తం said...

very nice sujji

loknath kovuru said...

నను బైట పడేయ్
నీ కన్నీటి సంద్రం నుంచి
యేది నన్నోమారు చూడనియ్
ఘనిభవించిన నీలో..
చిక్కటి ధారలు కారిన
నీ మనసు పొరలను
నను నిమరనియ్