ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం తనలోకి లాక్కుంటుంది ... ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో మనసంతా ఇరుకుచేస్తుంది .. ఉక్కిరిబిక్కిరిగా నన్ను ఏడిపిస్తుంది.. దాన్ని వెళ్ళగొట్టాలని చూస్తానా ముందు వెళ్ళేది "నువ్వు" అని వెక్కిరిస్తుంది ...
నీ మాటలు పండించే పువ్వులు నా మనసు నింపి , హాయి గంధాలు చిలుకుతుంది. నిన్ను కలవలేని మన మధ్య ఉన్న మైళ్ళ దూరాన్ని ప్రతి రోజు కొలుచుకుంటూ ... తెలీయకుండానే నీ సమీపానికి చేరుకుంటున్నా. ! ఆకాశం లో నాకోసం మెరిసే ఏ తారవో అని వెతుకుతున్నా .. ఏంత ముర్ఖురాలినో కదా.. నిన్ను చందమామ లో పోల్చుకోలేక పోయా.!! వేల నిముషాల వృధా ప్రయాసలో , నీకు నాకు మధ్య చిగురువేసిన బంధానికి నేనెప్పుడు తోడుగా ఉంటాను. మరి నువ్వు?
పెనవేసుకున్న నా చేతివేళ్ళల్లో నీ గుర్తులు చూసుకుంటున్నా!
విచ్చుకునే నీ చిరునవ్వు ఊహకై నా రాత్రులన్నీ ధారపోసి చకోరమై కలలు కంటున్నా..!!
Sunday, 28 June 2009
ఆగని కన్నీరు గుండె చెరువు చేస్తుంది.. ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా గొంతు అడ్దుపడుతుంది.. తడికన్నుల చెమ్మ మనసు తలుపులు మూసింది నువ్వు ఉన్నావనుకున్నా.. నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ..!!