పెనవేసుకున్న నా చేతివేళ్ళల్లో నీ గుర్తులు చూసుకుంటున్నా!
విచ్చుకునే నీ చిరునవ్వు ఊహకై నా రాత్రులన్నీ ధారపోసి చకోరమై కలలు కంటున్నా..!!
Sunday, 28 June 2009
ఆగని కన్నీరు గుండె చెరువు చేస్తుంది.. ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా గొంతు అడ్దుపడుతుంది.. తడికన్నుల చెమ్మ మనసు తలుపులు మూసింది నువ్వు ఉన్నావనుకున్నా.. నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ..!!
Sunday, 24 May 2009
నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే ..!
నీ జ్ఞాపకాల చేదే ..!!
తెరలు తెరలుగ నీ ఆలోచనలు ఒక్కొక్కటి గా వెక్కిరిస్తుంటే ..
నాలోకి నేను చూసుకోటానికే భయపడుతున్నా..!!
సగం మలిచిన మట్టి బొమ్మనై..
చేష్టలుడిగి నిలుచున్న...!!
Sunday, 12 April 2009
లేలేత వెదురు మురళిఫై
నీ తీయని ఆధరాలతో
నా అణువణులో నీఫై
ప్రేమనే ఆయువుగా
నీవు పలికే ప్రేమరాగాలకి
నే పరవళ్ళు తొక్కాను
దాచుకోలేని ఉద్వేగముతో
నీరాగంలో నాపాదం కలిపాను
ఎంత శోభాయమానంగా ఉంది ఈ దృశ్యం !
పక్షుల కిలకిలలు,
సెలయేటి గలగలలు,
సుమగంధాల పరిమళాలు,
నువ్వు,
నేను...
ఓహ్ ప్రియ..!
లోకమంతా మన ప్రేమ చిహ్నాలమయమేనా
ప్రకృతి లోని ప్రతి అణువు
మన ప్రేమ గాధలే ,
మన ఉసులే
నాలోని ఈ తమకం ,
నీ బాహువులోని సౌఖ్యం ,
నీ సమక్షంలోని పారవశ్యం,
ఈ క్షణం నా జీవితంలో పదిలం ..!
నువ్వు,
నా జీవితానికే అమూల్యం..!!
-- మన ప్రేమకి
( పైన ఉన్న బొమ్మ నేను వేసిందే..!)
Saturday, 14 March 2009
నువ్వు వదిలిన శూన్యంలో
దారి లేని శకలాన్ని అయ్యాను.. గుండె చీల్చుకొని
నేను పేట్టే ఆక్రందన
నిశబ్దంలో చేదుగా కలిసిపొయింది..
Saturday, 3 January 2009
యుగాలుగా ఒంటరిగా ఉన్న నేను నిజాయితీగా నా హృదయం పరిచాను..! నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు... !!