Tuesday, 8 December 2009

ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది


ప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది....
నీ మాటలు పండించే పువ్వులు నా మనసు నింపి , హాయి గంధాలు చిలుకుతుంది.
నిన్ను కలవలేని మన మధ్య ఉన్న మైళ్ళ దూరాన్ని ప్రతి రోజు కొలుచుకుంటూ ...
తెలీయకుండానే నీ సమీపానికి చేరుకుంటున్నా. !
కాశం లో నాకోసం మెరిసే ఏ తారవో అని వెతుకుతున్నా .. ఏంత ముర్ఖురాలినో కదా.. నిన్ను చందమామ లో పోల్చుకోలేక పోయా.!!
వేల నిముషాల వృధా ప్రయాసలో , నీకు నాకు మధ్య చిగురువేసిన బంధానికి నేనెప్పుడు తోడుగా ఉంటాను. మరి నువ్వు?

ప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది..
సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా?
జాగు చేయక చెప్పిపోరాదా?
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??
I Thank Srujana for her Words here with Me.
- Sujji

Wednesday, 28 October 2009

అన్నయ్య

ఈ తడవకు నా మాటలు ఇక్కడ.... B&G

Wednesday, 16 September 2009


ప్రాప్తం లేని నీ ప్రేమకు
గురుతైనా రాని గడ్దిపువ్వును నేను..
నీ జ్ఞాపకాల చిత్తడి లో
వెలసిపోయిన ఇంద్రధనస్సును నేను..!

Sunday, 16 August 2009


దోసిట్లో నువ్వు వదిలిన నవ్వులు
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి.
ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో
నా తనువంతా కన్నీటితో తడిచిపోతుంది.

Friday, 10 July 2009


ఘనీభవించిన వర్షపు చినుకుల చల్లదనం
నా హృదయంలో మెలికలుతిరుగుతుంది..
అర్ధంకాని సాయంత్రాలు
పెనవేసుకున్న నా చేతివేళ్ళల్లో నీ గుర్తులు చూసుకుంటున్నా!

విచ్చుకునే నీ చిరునవ్వు ఊహకై
నా రాత్రులన్నీ ధారపోసి చకోరమై కలలు కంటున్నా..!!

Sunday, 28 June 2009

ఆగని కన్నీరు
గుండె చెరువు చేస్తుంది..
ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా
గొంతు అడ్దుపడుతుంది..
తడికన్నుల చెమ్మ
మనసు తలుపులు మూసింది
నువ్వు ఉన్నావనుకున్నా..
నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ..!!

Sunday, 24 May 2009


నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే ..!
నీ జ్ఞాపకాల చేదే ..!!
తెరలు తెరలుగ నీ ఆలోచనలు ఒక్కొక్కటి గా వెక్కిరిస్తుంటే ..
నాలోకి నేను చూసుకోటానికే భయపడుతున్నా..!!
సగం మలిచిన మట్టి బొమ్మనై..
చేష్టలుడిగి నిలుచున్న...!!

Sunday, 12 April 2009

లేలేత వెదురు మురళిఫై
నీ తీయని ఆధరాలతో
నా అణువణులో నీఫై
ప్రేమనే ఆయువుగా
నీవు పలికే ప్రేమరాగాలకి
నే పరవళ్ళు తొక్కాను

దాచుకోలేని ఉద్వేగముతో
నీరాగంలో నాపాదం కలిపాను
ఎంత శోభాయమానంగా ఉంది ఈ దృశ్యం !
పక్షుల కిలకిలలు,
సెలయేటి గలగలలు,
సుమగంధాల పరిమళాలు,
నువ్వు,
నేను...
ఓహ్ ప్రియ..!
లోకమంతా మన ప్రేమ చిహ్నాలమయమేనా
ప్రకృతి లోని ప్రతి అణువు
మన ప్రేమ గాధలే ,
మన ఉసులే
నాలోని ఈ తమకం ,
నీ బాహువులోని సౌఖ్యం ,
నీ సమక్షంలోని పారవశ్యం,

ఈ క్షణం నా జీవితంలో పదిలం ..!
నువ్వు,
నా జీవితానికే అమూల్యం..!!
-- మన ప్రేమకి
( పైన ఉన్న బొమ్మ నేను వేసిందే..!)

Saturday, 14 March 2009


నువ్వు వదిలిన శూన్యంలో
దారి లేని శకలాన్ని అయ్యాను..
గుండె చీల్చుకొని
నేను పేట్టే ఆక్రందన
నిశబ్దంలో చేదుగా కలిసిపొయింది..

Saturday, 3 January 2009


యుగాలుగా ఒంటరిగా ఉన్న నేను
నిజాయితీగా నా హృదయం పరిచాను..!
నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ
నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు... !!