Friday, 10 July 2009


ఘనీభవించిన వర్షపు చినుకుల చల్లదనం
నా హృదయంలో మెలికలుతిరుగుతుంది..
అర్ధంకాని సాయంత్రాలు
పెనవేసుకున్న నా చేతివేళ్ళల్లో నీ గుర్తులు చూసుకుంటున్నా!

విచ్చుకునే నీ చిరునవ్వు ఊహకై
నా రాత్రులన్నీ ధారపోసి చకోరమై కలలు కంటున్నా..!!

7 comments:

ఆత్రేయ కొండూరు said...

baagundanDi.

సృజన said...

చిట్టికవిత బాగుంది..

Srujana Ramanujan said...

అమృత ధారల్లే నీ ప్రేమ ధార కురిపించమని వేడుకుంటున్నా,

కరుణించి నీ చిరునవ్వుల చిరుజల్లుని వరమిస్తావని ఎదురుచూస్తున్నా...

నేస్తం said...

చాలా బాగా రాసావు సుజ్జి

శేఖర్ పెద్దగోపు said...

కవిత చాలా బాగుంది. ఆ మాటకొస్తే మీ అన్ని కవితలు బాగున్నాయి. దీనికి మీదైన శైలిలో ఒక అందమైన శీర్షిక పెట్టండి.

మరువం ఉష said...

నీ హృదిలో నెలవున్న ఆ జాడకై నీకు నీవే అన్వేషిస్తే ఎలా, సుజ్జీ... కాసింత ఆ ఎదుటి మనసుకి నిన్ను వెదుక్కునే అవకాశమివ్వు మరి ;)

జైభారత్ said...

మనసకు మనసే ప్రతి బంధకం
నీ చూపులను
సూన్యంలో ప్రసరించకు
సుమీ
నేనున్నది నీలోనే..