లేలేత వెదురు మురళిఫై
నీ తీయని ఆధరాలతో
నా అణువణులో నీఫై
ప్రేమనే ఆయువుగా
నీవు పలికే ప్రేమరాగాలకి
నే పరవళ్ళు తొక్కాను
దాచుకోలేని ఉద్వేగముతో
నీరాగంలో నాపాదం కలిపాను
ఎంత శోభాయమానంగా ఉంది ఈ దృశ్యం !
పక్షుల కిలకిలలు,
సెలయేటి గలగలలు,
సుమగంధాల పరిమళాలు,
నువ్వు,
నేను...
ఓహ్ ప్రియ..!
లోకమంతా మన ప్రేమ చిహ్నాలమయమేనా
ప్రకృతి లోని ప్రతి అణువు
మన ప్రేమ గాధలే ,
మన ఉసులే
నాలోని ఈ తమకం ,
నీ బాహువులోని సౌఖ్యం ,
నీ సమక్షంలోని పారవశ్యం,
ఈ క్షణం నా జీవితంలో పదిలం ..!
నువ్వు,
నా జీవితానికే అమూల్యం..!!
-- మన ప్రేమకి
( పైన ఉన్న బొమ్మ నేను వేసిందే..!)
14 comments:
Gud one sujji
nice sujji
ఆ sketch మీరే వేసారా?
Excellent. Nothing to say. But the spelling mistakes aretaking away the beauty.
సుజ్జీ..
కవిత చాలా బావుంది. కానీ.. అక్కడక్కడ అచ్చు తప్పులున్నాయి.. చూసావా ;)
బొమ్మ మాత్రం సూపర్ గా వేసావు. ముఖ్యంగా ముఖ ఖవళికలు బాగా తీర్చిదిద్దావు.
Very cute poem. So, now out of pathos? :-)
suji drawing bagundhi,kavitha kuda bagundhi
సుజ్జి గారు ,బొమ్మ మీరు వేసిందేనా ? బావుందండీ !
రాధాకృష్ణుల ప్రేమను చిత్రీకరించడమే కాదు , చక్కగా వ్యక్తీకరించారు కూడా !
చిత్రంలోని అందాలన్నీ కవితలో ఒదిగాయి.
కవితలోని పదాలన్నీ సాగి రేఖలై చిత్రంగా మారాయి.
రెండూ బాగున్నాయి.
రాధామాధవీయాన్ని బాగా ఔపాసన పట్టి అంతే బాగా ఆకళింపు చేసుకున్నారల్లేవుంది. చిత్రం, కావ్యం ఒకదానితో ఒకటి పోటి పడుతున్నట్లుగావున్నాయి. నిజానికి ఈ టపా, ముందు టపా మునుపే చదివాను, సమయాభావం వలన వ్యాఖ్య వ్రాయటానికి జాప్యం వచ్చింది.
కవితా లిఖితము
చిత్రలేఖనము
రెండూ బాగున్నాయండి...
So cute Sujji.
miru vesina bomma baumdhi eppudu vesaro thelusukovacha i meen childwoodlona ani
veeru
Post a Comment