Tuesday 15 July 2008

నా మొదటి టపా

హామ్యయ! నేనూ బ్లాగానోచ్..!

ఏంటో..,ఈ బ్లాగ్ గాలి నాకు ఈ మథ్య సోకింది. ఏంతంటే, ఈరోజు తో నేనూ ఒక బ్లాగుదానైపోయా. నాకున్న వెర్రి, పిచ్చి గట్రా సరంజామాతో రంగంలోకి దిగుతున్నా..! ఆశీర్వదించేయండి..

అసలు నేను బ్లాగులు చదవటం మొదలెటి గట్టిగా పది రోజులు కాలేదు..కానీ, ఎంత నచ్చాయంటే, ఆ నచ్చటం వికటించి.. రాయటం మొదలెట్టాలనిపించిది...సరే, అని ఈ fine మార్నింగ్ కూర్చోని ప్రారంబించాను.

నాకు వచ్చినవి, నాకు నచ్చినవి అన్నీ కలిసుండేదే ఈ బ్లాగాహారం. ఏమన్నా అప్పుతచ్చులు ఉంటే క్షమించండి.

దీనికి పేరు ఏం పెట్టాలో అర్దం కాలేదు. చివరకి .."నాలో నేను" అని పెట్టా. ఎలా ఉందో ఏంటో..

నాకు సాధ్యమైనంతవరకు విసుగు రాని విషయాలే బ్లాగుతానని హామీ ఇస్తూ ..ఇప్పటికి విరమిస్తాను.
ఇట్లుసుజన (' సుజ్జి ' మన ముద్దు పేరు మరి...)

13 comments:

MURALI said...

సుజన గారు,
బ్లాగు లోకానికి స్వాగతం. నేను కూడా కొత్త బ్లాగర్నే. మీ నుండి మంచి టపాలను ఆశిస్తున్నాం.
చంపేయండంతే.

మురళీధర్
http://muralidharnamala.wordpress.com/

MURALI said...

సుజన గారు,
నాలోనేను అని ఎవరిదో బ్లాగు ఉందండి.

చైతన్య.ఎస్ said...

బ్లాగు లోకానికి స్వాగతం..సుస్వాగతం.

మీనాక్షి said...

హాయ్...సుజన గారు..
మొత్తానికి ఎలాగైతేనేం బ్లాగ్ లోకం లోకి వచ్చారు కదా..
స్వాగతమ్ ..సుస్వాగతమ్...
నేను కొత్తగానే ఇ మధ్యే వచ్చాను...
.........................
అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్..
వర్డ్ వెరిఫికేషన్ తీసెయగలరు....
................
ఇంకేముంది ఇక కుమ్మేయండి...
టపా ల మీద టపాలు రాసేయండి...


మీనాక్షి..!

రాధిక said...

స్వాగతం సుజన గారు.చూస్తు0టే మాకు ఇక్కడ నవ్వుల వి0దు దొరికేటట్టు వు0ది.
అన్నట్టు వర్డ్ వెరిఫికేషన్ తీసెయగలరు.

సుజ్జి said...

మురళిగారు, చైతన్యగారు, మీనాక్షిగారు, మరియు రాధికగారు.....

చాలా సంతోషం గా ఉంది. నేను బ్లాగెడితె ఏవరు చదువుతారా.. అని తీవ్రంగా thinka కా... కానీ , నాకోసం మీరు ఉన్నారని తెలిసి , చాలా ఆనందంగా ఉంది.

మీనాక్షిగారు, రాధికగారు, word verification తీసేసా.
ఇంకా ఏమైనా తప్పులు ఉంటే, చెప్పండి. సరిచేసుకుంటా.

మరొక్కసారి, అందరికి ధన్యవాదాలు...

మీ
సుజ్జి

ప్రియ said...

Good. welcome. write fun.:-)

ప్రియ said...

నేను అనటానికి nenu సరిపోతుంది. ఏమంటారు?

Purnima said...

Thanks so much for giving me the lyrics of that song. It has made my day for sure. Thank you!!

And I'm simple awe stuck by your patience to read and comment on my posts. I know what it takes to read my posts at a stretch. I could only wish, you had a nice time over there. Thanks for all those "cappatlu", indeed made my day.

Keep blogging,
Purnima

Unknown said...

సుజ్జి,
ప్రారంభం చాలా బాగుంది (ముఖ్యంగా మీ రెండు కవితలు). మరిన్ని మంచి టపాలు అందిస్తారని ఆశిస్తాను.

Sudha Rani Pantula said...

సుజ్జి,
అలా పిలిస్తే మీరు మా చిట్టి చెల్లాయిలా అనిపిస్తారు,అని.నా నాగావళినవ్విందికి కామెంట్ చూసి
ఇటొచ్చా. మంచి నవ్వులవిందు చేసేలా ఉంది మీ టపా.ఇంకా బోల్డు బోల్డురాసి మాకందరికీ నవ్వులు పంచాలని కోరుకుంటూ,నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలతో.
తవికలంటే శ్రీలక్ష్మివే-మీరు మాత్రం కవితలే రాయండేం.

Sudha said...

నాది కాని లోకంలో
ఏ మనిషిని వెతకను..??
నీళ్ళు లేని సంద్రంలో
ఏ నావను నడపను..!!??


చాలా బాగుంది .....!

చంపేయండంతే.


Sudha

Anonymous said...

Sujana gaaru..

mee peru vinte naa freindu gurtukocchindi..

annattu mee blog peru vinte koodaa..

"naalo nenu lene lenu.. epudo nenu nuvvayyaanu!!"

gurtocchidnaa..